పట్టణాభివృద్ధి శాఖ షిండేకే!
*5న ప్రమాణ స్వీకారం
*డిప్యూటీలుగా షిండే, పవార్
*చకచకా సాగుతున్న ఏర్పాట్లు
*షిండేతో భేటీ అయిన ఫడ్నవీస్
* నిరుత్సాహంతోనే షిండే ఆసుపత్రి పాలు: మంత్రి
ముంబై, డిసెంబర్ 3: మహా పంచాయితీ ముగిసింది. నిన్నటి వరకు మహాయుతి కూటమిలో తదుపరి సీఎంగా ఎవరు ఉం టారనే దాని మీద మళ్లగుల్లాలు పడిన నేత లు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోం ది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షిండేకు ఈసారి మొండిచేయే ఎదురవనున్నట్లు సమాచా రం. ఈ మేరకు బీజేపీ నేత ఫడ్నవీస్‌ను సీఎంగా నియమించాలని కూటమి నేతలు అంగీకారానికి వచ్చారు. ఫడ్నవీస్ తదుపరి కాబోయే మహా సీఎం అంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్) వర్గం నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు డిప్యూటీ లుగా బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది.
5న ముగ్గురే!
డిసెంబర్ 5న మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రెండేళ్ల నుంచి మహా సీఎంగా ఉన్న షిండే ఈసారి డిప్యూటీతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి వర్గాన్ని ఎలా రూపొందిస్తారని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేబినేట్ ఇలా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* బీజేపీ నుంచి 21 మంది మంత్రులు
* శివసేన: 16 మంది మంత్రి పదవులకు పట్టుబట్టగా 12 మంది ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
* ఎన్సీపీ: 9 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది.
aబీజేపీ వద్దే హోం, రెవెన్యూ, స్పీకర్ వంటి కీలక పొజిషన్లు ఉండే అవకాశం ఉంది. శివసేనకు కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ, డిప్యూటీ చైర్మన్ పదవి, కౌన్సిల్ చైర్మన్ మొదలయినవి. ఇక ఎన్సీపీ వద్ద ఆర్థిక శాఖతో పాటు డిప్యూటీ స్పీకర్ ఉండే అవకాశం ఉంది.
డిశ్చార్జి అయిన షిండే..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయన చివరికి ఆసుపత్రి గడప తొక్కాల్సి వచ్చింది. థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్న షిండే డిశ్చార్జి అయ్యారు. డిసెంబర్ 5న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ముంబైలో ఆజాద్ మైదానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు.
షిండేను కలిసిన ఫడ్నవీస్
ఏక్‌నాథ్ షిండే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన్ను కలిశారు. డిసెంబర్ 5న ఫడ్నవీస్, షిండే, పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినేట్ బెర్తుల గురించి వీరు చర్చించినట్లు సమాచారం.
పంతం నెగ్గించుకున్న షిండే!
మహా సీఎం పదవిని వదులుకున్న షిండే హోం శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ కావాలని పట్టుబట్టినట్లు ప లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పట్టణాభివృద్ధి శాఖను షిండేకు ఇచ్చేం దుకు నూతన సీఎం ఫడ్నవీస్ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నా యి. మహా ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖకు ఎక్కడ లేని ప్రాముఖ్యత. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ శాఖ సీఎం షిండే వద్దే ఉంది. ఎప్పుడైనా సీఎంగా ఉన్నవారే ఈ శాఖను నిర్వహిస్తారు.
ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. కూటమి నాయకుడిని నిర్ణయించేందుకు నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై కసరత్తు చేస్తోంది. శివసేన హోం మినిస్ట్రీ కూడా అభ్యర్థించింది. సీఎం పదవి ఇవ్వనందుకు షిండే కాస్త నిరుత్సాహపడ్డాడు. అందుకోసమే ఆసుపత్రి పాలయ్యాడేమో. గతంలో షిండే దగ్గర ఫడ్నవీస్ డిప్యూటీగా చేయలేదా. షిండే కూడా డిప్యూటీకి అంగీకరించాలి.
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే






