28 April, 2026 | 7:57 PM

మంత్రి శ్రీధర్ బాబుని కలిసిన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

28-04-2026 06:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో అసెంబ్లీ వద్ద ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,12 మంది కౌన్సిలర్స్ మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించడం జరిగిందని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా కోరడం జరిగింది అన్నారు,ఇందుకు మంత్రి  సానుకూలంగా స్పందించడం జరిగింది అని , ఒక రోజు మున్సిపల్ కార్యాలయాన్ని తప్పకుండా సందర్శిస్తానని మాట ఇచ్చారు అని రాధాకృష్ణ తెలిపారు.