భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు
ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): భార్య భర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చేసుకోగా మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ చంద్రపురి కాలనీలో సఫావత్ రాజు భార్య జ్యోతి ఇద్దరు కుమారులు జస్వంత్ యశ్వంత్ తో కలిసి నివసిస్తున్నారు.
అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో ఇటీవల గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 24న రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా మనస్తాపం చెందిన జ్యోతి( 30) మరసటి రోజు ఇంట్లో చెప్పకుండా పిల్లలను తీసుకొని బయటికి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికిన బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు భర్త రాజు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






