24 నుంచి వేసవి సెలవులు
l జూన్ 11 వరకు మొత్తం 49 రోజుల పాటు..
l నేడు ఎస్‌ఏ ఆఖరి పరీక్ష
l రేపు బడులకు లాస్ట్ వర్కింగ్‌డే
l జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఒకటి నుంచి తొమ్మిదో తర గతి వరకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ) పరీక్షలు సోమ వారంతో ముగియనున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారం భం కాగా నేటితో పరీక్షలు పూర్తి కానున్నాయి. జవాబు పత్రాలను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసి విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 23న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించి వారి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవ్వనున్నారు.
ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు 2023 అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లు బడులకు వేసవి సెలవులను ఇవ్వనున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ సారి మొత్తం 49 రోజులపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు వర్తించనున్నాయి. ఇదిలా ఉంటే ఇంటర్ కాలేజీలకు ఇప్పటికే వేసవి సెలవులను ప్రకటించగా.. జూన్ 1న పునఃప్రారంభంకానున్నాయి.
ఎండలు ఎక్కువుంటే సెలవులు పొడిగింపు!
రాష్ట్రంలో మే నెల రాకముందే ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి జూన్ 11 తర్వాత కూడా కొనసాగితే పాఠశాలలకు వేస వి సెలవులను మరికొన్ని రోజు లు పొడిగించే అవకాశం ఉంది. సా ధారణ పరిస్థితులే ఉంటే యథావిధిగా బడులు జూన్ 12 నుంచే పునః ప్రా రంభం కానున్నాయి. అయితే దీనిపై అప్పటి పరిస్థితులను బట్టి విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నది.






