17-07-2025 12:00:00 AM
- 2034 నాటికి 33,773 మెగావాట్ల డిమాండ్
- సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు
- విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): భవిష్యత్తు లో ఏర్పడే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీడీసీ ఎల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ర్టం లోని ప్రజలకు అత్యంత నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గతేడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయగా.. ఈ ఏడాది 18 మార్చిన 335.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు డిమాండ్ ఏర్పడగా సరఫరా చేశామన్నారు. ఇది రాష్ర్ట చరిత్రలో ఇదే అత్యధికమన్నారు. గతేడాది మార్చి 8న 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడగా.. ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడిందన్నారు.
సుమారు 2,000 మెగావాట్ల అదనపు డిమాండ్ ఏర్పడినప్పటికీ విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయగలిగామని తెలిపారు. రాష్ర్టంలో విద్యుత్ పీక్ డిమాండ్ 2024 నుంచి 9.8 శాతం చొప్పున పెరుగుతోందని.. 2034 నాటికి ఇది 33,773 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు విశ్లేషించినట్టు తెలిపారు.
విద్యు త్ సరఫరాలో ఇబ్బందులు తలెత్త కుండా కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని అధికా రులను ఆదేశారు. కొత్త సబ్ స్టేషన్ నిర్మిస్తున్న ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించే విషయంపై దృష్టి సారించాలన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ని ర్మాణానికి పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం చే యాల ని అధికారులను ఆదేశించారు.
సమావేశం లో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ న వీన్ మిట్టల్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భా స్కర్, జెన్కో సీఎండి హరీశ్, ఎస్పీడీసీఎల్ సీ ఎండీ ముషారఫ్ ఫారుఖీ, ఎన్పీడీసీఎల్ సీ ఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.