6 August, 2026 | 2:31 AM

పామాయిల్ మొక్కలు సకాలంలో అందించండి

06-08-2026 01:22 AM

రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి

వ్యవసాయ మంత్రి తుమ్మల

అశ్వారావుపేట ఆగస్టు 5 (విజయక్రాంతి): కొత్తగా పామాయిల్ మొక్కలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పామాయిల్ మొక్కలను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ ఫెడ్ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి  మంత్రి తుమ్మలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పామాయిల్ సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పామాయిల్ మొక్కలను సకాలంలో అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పై దృష్టి సారించాలని ఆయిల్ షెడ్ లో మొక్కలు కొరత ఉన్నచో ప్రవేట్ నర్సరీ నుంచి పామ్ ఆయిల్ మొక్కలను సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.