6 July, 2026 | 1:10 PM

Breaking News

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •  

చేవెళ్ల పీఏసీఎస్ అభివృద్ధికి సహకారం

30-06-2025 02:06 AM

డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య

చేవెళ్ల, జూన్ 29:చేవెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తన వంతుగా సహకారాన్ని అందిస్తానని డీసీసీబీ చైర్మన్ కొత్త కురువ సత్తయ్య తెలిపారు. ఆదివారం సొసైటీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ సకాలంలో సేవలు అందించాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు.

చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి తన సొంత నిధులతో సొసైటీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవి గౌడ్, గుండాల సహకార సంఘం చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు పైండ్ల మధుసూదన్ రెడ్డి, నరసింహులు, ఎజీఎం ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.