6 July, 2026 | 2:20 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేర్పించడమే లక్యం

30-06-2025 02:07 AM

ఎంవి ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ

ఇబ్రహీంపట్నం, జూన్ 29:విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేర్పించడమే ప్రధాన లక్యంగా పనిచేస్తున్నామని ఎంవి ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులలోని టాలెంట్ ను వెలికితీయడానికి 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు దాదాపు 500 మంది విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని ప్రోత్సహించి వారి భవిష్యత్ కు బాటలు వేయడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్ములించడం, అర్హులైన పిల్లలందరిని స్కూల్ లో చేర్పించడం, పిల్లలు ఉన్నత శిఖరాల కోసం ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంవి ఫౌండేషన్ రెమిడియల్ ఇంచార్జ్ రాధిక, ఆరుట్ల గ్రామ వివోఏ లు నూకం సంతోష, తలారి ప్రమీల, ఆందోజు చామంతి, రజిత, సునీత, మంజుల, కో-ఆర్డినేటర్ సంగీత, రెమిడియల్ టీచర్ భూదేవి, జోగు వినోద్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.