15 August, 2026 | 1:17 AM

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో

15-08-2026 12:23 AM

బోధన్, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : బోధన్ ఆర్డీవో  ఎం.విజయకుమారి, తహసీల్దార్తో కలిసి బోధన్ పట్టణంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బిల్లులు, బడ్జెట్, మౌలిక వసతులు, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, టాయిలెట్లు, క్రీడా ప్రాంగణం తదితర సౌకర్యాలను పరిశీలించారు.

అనంతరం పాఠశాలలో కొనసాగు తున్న బోధనా విధానాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై కూడా ఆరా తీశారు.