పంద్రాగస్టు వేళ అలర్ట్
ఆమనగల్‌లో సర్‌ఫ్రైజ్ తనిఖీలు
అమనగల్, ఆగస్టు 14(విజయక్రాంతి): ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమనగల్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫ్యూచర్ సిటీ సీపీ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం అమనగల్ బస్టాండ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ స్ర్పజ్ వెహికల్ చెకింగ్ నిర్వహించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో బస్సులు, ఇతర వాహనాలు మరియు అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో పాపిలాన్ చెకింగ్స్ చేపట్టి రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.పట్టణంలో ప్రజల భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా గుర్తుతెలియని వస్తువులు కనిపిస్తే తక్షణమే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని అమనగల్ సీఐ ఎస్. వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






