18 July, 2026 | 6:38 AM

హమారే బారాహ్‌కు సుప్రీం షాక్

14-06-2024 12:05 AM

చిత్రం విడుదల నిలిపేస్తూ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, జూన్ 13: వివాదాస్పద హమారే బారాహ్ చిత్రాన్ని విడుదల చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. చిత్రంలో ముస్లింల ఆచారాల ను అవమానించేలా సంభాషణలు ఉన్నాయని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. ‘ఈ సినిమా ట్రైలర్‌ను ఉదయమే చూశాం. అందులో అన్నీ అభ్యంతరకర సంభాషణలే ఉన్నాయి’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నిలిపేయా లని అజహర్ బాషా తంబోలి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. దీనిని విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. ఈ చిత్రాన్ని అన్నుకపూర్ రూపొందించారు.