1 September, 2026 | 10:49 AM

అసాంఘిక శక్తులపై నిఘా..

14-03-2025 12:09 AM

సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్ 

హోలీ, రంజాన్ మాసం సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ సూచన

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13(విజయక్రాంతి): 35 ఏండ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసంలో రెండో శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. నగర పోలీసు అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగుల హోలీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లాఅండ్‌ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, లాఅండ్‌ఆర్డర్ అడిషనల్ సీపీ చైతన్యకుమార్, డీసీపీ స్పెషల్‌బ్రాంచ్ తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.