20 June, 2026 | 2:38 AM

ఏసీబీకి చిక్కిన సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

20-06-2026 12:00 AM
  1. రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి
  2. నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో ఘటన   

నల్లగొండ క్రైం, జూన్ 19(విజయక్రాంతి): నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ జీ పవన్‌కుమార్‌ను రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎ స్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల మేరకు చిట్యాల మండలంలో ఓ గ్రామానికి చెందిన తల్లి, అత్తలకు చెందిన భూముల సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యు ని నుంచి పవన్‌కుమార్ రూ.35 వేలు లంచం డిమాండ్ చేసి, రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు.

మిగ తా రూ.15వేలు ఫిర్యాదుదారుని నుంచి తీసుకుంటుండగా కలెక్టరేట్ సమీపంలో రెడ్ హ్యాండెడ్‌గాపట్టుబడ్డారు. ఆయన నివాసంలోను అక్ర మ ఆస్తుల విషయమై తనిఖీలు చేస్తున్నామని, పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ వి ధించినట్లు తెలిపారు. అధికారులు చట్టబద్ధంగా పనిచేయకుండా లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యా దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.