నలుగురు టీచర్ల సస్పెన్షన్
19-07-2026 01:06 AM
13 మంది విద్యార్థులకు టీసీలివ్వడంతో విచారణ
తుంగతుర్తి, జులై 18 (విజయక్రాంతి): ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో విద్యార్థులు జీరో స్థితికి చేర్చి, హెచ్‌ఎంను సస్పెన్షన్ గురి చేసిన సంఘటన విజయకాంతి దినపత్రికలో శుక్రవారం ‘ఉపాధ్యాయులు ఉన్నా..
విద్యార్థుల సంఖ్య సున్నా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో డీఈవో అశోక్ శనివారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులైన కోటయ్య, సుజాత ,గీత, శ్రీనివాసలను డీఈవో కార్యాలయంలో విచారణ చేపట్టి ఆరా తీశారు. ప్రిన్సిపాల్ హకీమ్‌ను మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయగా శనివారం నలుగురు టీచర్లను సస్పెండ్ చేశారు.






