calender_icon.png 13 January, 2026 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు మార్గదర్శకుడు స్వామి వివేకానంద

13-01-2026 12:54:46 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్, జనవరి 12 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎ మ్మె ల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్వామి వివేకా నంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన బోధనలతో భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శ ప్రాయుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సామల హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాజేంద్రప్రసాద్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, పల్ల సురేష్ , మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, బిరుదు కృష్ణ , పన్నాల రాములు, ఊట్ల వరప్రసాద్, ఎం. రవీందర్, గజభింకార్ శ్రీనివాస్, అమిరిశెట్టి రాజలింగం, డి. రాజయ్య, చింతల రాజు, పల్ల సురేష్, అమీనోద్దీన్, దూడం లింగమూర్తి, గోరె, సాదుల కరుణాకర్, జూపాక కుమారస్వామి,  ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.