ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం
02-05-2026 08:24 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గా కాటం స్వరూప శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి. రవికుమార్ వద్ద నుండి బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తికి ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రవికుమార్ నాయక్, కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. బార్ అండ్ బెంచ్ పరస్పరం సహకారంతో కక్షిదారులకు న్యాయ సేవలు అందించాలని తెలిపినారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జితో పాటు ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రవికుమార్ నాయక్, కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






