23 May, 2026 | 2:47 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

23-05-2026 02:03 PM

అట్టహాసంగా శ్రీ అంబా భవాని మాత దేవాలయ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ మే 23 (విజయక్రాంతి): అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఫరూఖ్ నగర్ మండలం శ్రీ ఎలికట్ట అంబా భవాని మాత దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం నూతన అభివృద్ధి  కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అనంతరం ఎమ్మెల్యే   దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా చాకలి చంద్రయ్య, కమిటీ సభ్యులు నాగారం రామ్ రెడ్డి, బాలరత్నం గౌడ్, ముత్యాల రాములు, జంగం లింగం, కుక్కల మహేష్, సాప్రమోని రేణుకలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన అభివృద్ధి కమిటి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే పవిత్రమైన దేవాలయమన్నారు. పదవులు తీసుకోవడం కాదు, పదవులకు వన్నె తెచ్చే విదంగా ఉండాలన్నారు.  

గత కమిటీ ఉన్నప్పుడు నిధులు తెచ్చాం కానీ పనులు జరగలేదన్నారు. 50లక్షలు మంజూరు చేసిన ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అమ్మ సేవ, అభివృద్ధి చేయాలని సూచించారు. బాధ్యతలు తీసుకున్నప్పుడు దానికి నిబ్బతత ఉండాలన్నారు. దేవాలయ అభివృద్ధి చేస్తే పేరు ఎప్పటికి ఉండిపోతుందన్నారు.  ఎవరు ఎవరికి శత్రువులుగా ఉండకుండా అందరూ కలిసి దేవాలయం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. సంకల్పంతో పని చేయండని సూచించారు. దాతలు, భక్తుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకుందామని అన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.