23 May, 2026 | 2:42 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన

23-05-2026 02:01 PM

బోథ్, మే 23(విజయక్రాంతి): రైతుల నుండి కొనుగోలు చేసిన జొన్నలను తరలించడంలో జాప్యం జరగడానికి నిరసిస్తూ శనివారం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. లారీలు రాకపోవడంతో మార్కెట్ యార్డులోనే ఉన్న సంచులు తడిసిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం సీఈఓ నారాయణ కు వినతిపత్రం అందించారు. కనపడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు కోరారు. కనీసం 12 లారీలను ఏర్పాటు చేసి జోనలను తీసుకువెళ్లాలని రైతుల డిమాండ్ చేశారు. పూకం వేసిన  బస్తాలు తీసుకు పోకపోవడంతో తాము రోజు కాపల కాయలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. అధికారులు ఈ విషయంలో రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు