శ్రీ చక్రేశ్వరఆలయ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం
బోధన్,జూలై 10(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం నూతన ఛైర్మన్ గా లక్ష్మణ్ పటేల్ శుక్రవారం చక్రేశ్వర ఆలయ ఈవో నాయకం రాములు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆగంటి. లక్ష్మణరావు పటేల్ ఆలయ చైర్మన్, ఏ. శంకర్, ఎస్.గంగాధర్, జె.వీరప్ప, ఈ.మౌనిక, పోశెట్టి ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య ఉత్తర్వుల ప్రకారంగా ఈ క్రింది సభ్యులతో (03) మూడు సంవత్సరాల కాలానికి ఒక ‘పునరుద్ధరణ కమిటీ‘ ని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తుంది.
పునరుద్ధరణ కమిటీ సభ్యులకు దేవస్థానం నుండి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ కు ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహరాజ్ ఆశీర్వాద వచనాలు అందించారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు.






