11 July, 2026 | 2:52 AM

సాంస్కృతిక వైభవాన్ని చాటిన అల్ఫోర్స్ విభావరి

11-07-2026 01:12 AM

కొత్తపల్లి, జూలై 10 (విజయక్రాంతి): కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల ‘విభావరి‘ పేరుతో నిర్వహించిన కార్యక్రమం సాంస్కృతిక వైభవాన్ని చాటింది. ముఖ్యఅతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, నిరంతరం కృషి చేయడం ద్వారా లక్ష్యాలను సాధించగలుగుతారని, తల్లిదండ్రులకు ఖ్యాతిని తీసుకురాగలరని అన్నారు. 

అల్ఫోర్స్ విద్యాసంస్థలు ఆరంభం నాటి నుండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నదని, విద్యార్థులను ఉత్తమమైన స్థానాలలో స్థిరపరుస్తున్నదని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రణాళిక బద్ధంగా కష్టపడాలని, విజయాలను సాధించాలని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అత్యధిక సీట్లు సాధించినదని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేసాయి. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.