23 June, 2026 | 10:20 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

హిర ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో మస్జిద్ ఇమామ్లకు స్వెటర్లు పంపిణీ

13-12-2025 03:47 PM

గ్రామీణ ప్రాంత మస్జిదుల ఇమామ్ల సంక్షేమమే హిర ఫౌండేషన్ లక్ష్యం

ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్

కొత్తపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల మస్జిద్ ఇమామ్ ల సంక్షేమమే లక్ష్యంగా హిర ఫౌండేషన్ కరీంనగర్ గత 25 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సేవలను అందిస్తుందని, ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. శనివారం నగరంలోని రేకుర్తి షేఖాన్ నగర్ లోని మస్జిదే షేఖాన్ లో, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 50 గ్రామాల మస్జిదుల ఇమామ్లకు, వారి కుటుంబ సభ్యులకు సతీసమేతంగా శీతాకాలం దృష్ట్యా 100 స్వెటర్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఫ్తి ఘియాస్ మోహియోద్దీన్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత 25 సంవత్సరాలుగా అలుపెరగకుండా శీతాకాలం వచ్చినప్పుడల్లా గ్రామీణ ప్రాంతాల మస్జిద్ ఇమామ్లకు రగ్గులను, బ్లాంకెట్లను, సోలాపూర్ బెడ్ సీట్లను నిర్విరామంగా, పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంతే కాకుండా హిర ఫౌండేషన్ ద్వారా రంజాన్ మాసంలో పేదలకు బియ్యం వంట సామాగ్రి బక్రీద్ మాసంలో మాంసాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హాఫిజ్ అహ్మద్ హిప్జి, కలీం షరీఫ్, హఫీజ్ ఫరీద్, అబ్దుల్ రాఫె, మహమ్మద్ రఫీ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.