calender_icon.png 16 December, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండుగగా అయ్యప్ప పడిపూజ

13-12-2025 03:44:06 PM

కరీంనగర్ రూరల్,(విజయక్రాంతి): దుర్షేడ్ డివిజన్లో గల  శివ కేశవ క్షేత్రం మరకత లింగ రాజరాజేశ్వర స్వామి(Marakata Linga Rajarajeshwara Swamy),  వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో శనివారం హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్నిగంగారపు వంశీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో.. దేవరాజు ప్రశాంత్ శర్మ ,చిగురాల మధుసూదనాచార్యులు గార్ల నిర్వహణలో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మాలధారులు  పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో  అయ్యప్ప మాలదారులతో పాటు నాయకులు నందాల  తిరుపతి, సుంకిశాల  సంపత్ రావు , గోలే సంతోష్,  వేముల రామచంద్రం,  కోరుకంటి  సత్యనారాయణ రావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.