calender_icon.png 13 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద అంబర్‌పేట్‌లో హైడ్రా అధికారుల పర్యటన

13-11-2025 12:00:00 AM

విజయక్రాంతి వరుస కథనాలకు స్పందించిన అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 12: రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సౌటకుంట ప్రాంతంలో హైడ్రా అధికారులు బుధవారం పర్యటించారు. సౌటకుంట ఎఫ్‌టీఎల్‌లో నిబంధనలకు విరుద్దంగా వీఆర్‌సీ కన్వెన్షన్ నిర్మించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట లక్ష్మారెడ్డి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. అదే విధంగా విజయక్రాంతి దిన పత్రికలో వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు.

కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్‌సీ కన్వెన్షన్, గోడౌన్ల పరిసరాలను  పరిశీలించారు. వీఆర్‌సీ నిర్మాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని హైడ్రా ఆఫీసుకు రావాలని   సూచించినట్లు హైడ్రా సబ్‌ఇన్‌స్పెక్టర్ ముజఫర్ తెలిపారు. డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత.. అక్కడ నిర్మాణాలను నిబంధనలకు విరుద్దంగా ఉంటే చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు.