calender_icon.png 4 May, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

04-05-2025 12:00:00 AM

రంగురంగుల కోడిపిల్లలు

చిన్నప్పుడు ఇవంటే భలే ఇష్టంగా చూసుకునేది.. ఒక రూపాయికి ఒక కోడిపిల్లని ఇచ్చేవారు. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి వెంటనే వాటి పక్కకి వెళ్లి కాసేపు వాటితో ఆడుకోవడం భలే సరదాగా ఉండేది. వాటికి గ్లాసులో నీళ్లు పెట్టి తాగించడం.. బియ్యం గింజలు వేయడం.. వంటివి మధురమైన జ్ఞాపకాలు.

వాటిని పిల్లులు, కాకులు, గద్దలు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక అట్ట డబ్బాతో ప్రత్యేకంగా ఒక చిన్ని గూడును తయారు చేసేది. కానీ వాటిని ఎంత కాపాడిన కొద్దిరోజులకే చనిపోయేవి.. అప్పుడు మనసుకు బాధగా కలిగేది.

రైట్.. రైట్!

బాల్యపు జ్ఞాపకాలతో ఊరికి ప్ర యాణం మొదలెట్టాలి.. బస్సు ఎక్కిన దగ్గరి నుంచి ప్రతి మలుపులో తెలియని అనుభూతి.. ప్రతి కుదుపులో ఏదో సంతోషం. ప్రతి నిలుపు స్థలంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. బస్సెక్కి అనేయండి.. రైట్.. రైట్.. బాల్యం నచ్చని వారు ఎవ్వరు ఉండరేమో.

అది పల్లెటూరిలో అయినా.. పట్నంలో అయినా.. పల్లెటూరి బాల్యం ప్రకృతితో ముడిపడి ఉంటే.. పట్నం బాల్యం టెలిస్కోప్ లో నక్షత్రాలు  చూస్తే.. పల్లెటూరి పిల్లవాడికి వేగు చుక్క తెలవారుతుందని చెప్తుంది. మరీ ఈ వేసవి కాలంలో అమ్మమ్మ ఊరెల్లి మధురమైన జ్ఞాపకాలను పోగేసుకుందామా..