04-05-2025 12:00:00 AM
మైక్రోసాఫ్ట్ స్థాపన
1975 ఏప్రిల్ 4న బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. నేడు మైక్రోసాఫ్ట్ ఒక బహుళజాతి సంస్థగా అభివృద్ధి చెందింది. ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ తయారీదారు. ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తిదారులు ఉన్నారు.
నాటో ఏర్పాటుకు నాంది
1949 ఏప్రిల్ 4న ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సైనిక కూటముల్లో ఒకటిగా ఉన్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) ఒప్పందంపై 12 దేశాలు సంతకం చేశాయి. ఇవాళ ఈ కూటమిలో వున్న దేశాలన్నీ అజయశక్తిగా మారాయి.
ల్యాండ్‌మైన్ డే
ల్యాండ్‌మైన్‌ల గురించి అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 4వ తేదీని అంతర్జాతీయ మైన్ అవగాహన, సహాయ చర్య దినోత్సవంగా జరుపుకొంటుంది. ఈ రోజున జరిగే కార్యకలాపాలలో ప్రమాదాల గురించి చైతన్యం పెంచడానికి, గనుల తొలగింపు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం మరియు ల్యాండ్‌మైన్‌లు మరియు పేలని మందుగుండు సామగ్రితో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఉన్నాయి.