అడుగు దూరంలో
మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్
సెమీస్‌లో బోపన్న జోడీ ఓటమి
మట్టికోటపై తనకు ఎదురులేదని ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ మరోసారి నిరూపించింది. ఇప్పటికే ముచ్చటగా మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకున్న పొలాండ్ చిన్నది నాలుగో సారి టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తనకు అచ్చొచ్చిన వేదికలో మరోసారి దుమ్మురేపిన స్వియాటెక్ సెమీఫైనల్లో అమెరికా స్టార్ కోకో గాఫ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. 2022, 2023లో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్ హాట్రిక్ టైటిల్‌పై కన్నేసింది. మరో సెమీస్‌లో ఇటలీ చిన్నది జాస్మిన్ పావోలిన్ తన ప్రత్యర్థి మిర్రా ఆండ్రీవాను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న ద్వయం సెమీస్‌లో ఇంటిబాట పట్టింది.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పొలాండ్) ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో స్వియాటెక్ 6 6 కోకో గాఫ్ (అమెరికా)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో స్వియాటెక్ తన నంబర్‌వన్ ఆటను ప్రదర్శిస్తూ ఆద్యంతం ఆధిపత్యం కనబర్చింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని స్వియాటెక్ రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించింది. స్వియాటెక్ 4 బ్రేక్ పాయింట్లు, 10 విన్నర్లు సంధించగా.. గాఫ్ 39 అనవసర తప్పిదాలు చేసింది. స్వియాటెక్‌కు ఇది వరుసగా మూడో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. 2020లో తొలిసారి ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన స్వియాటెక్.. ఆ తర్వాత 2022, 2023లోనూ ఇక్కడ టైటిల్స్ నెగ్గింది. మరో సెమీఫైనల్లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 6 6 మిర్రా ఆండ్రీవా (రష్యా)పై అలవోక విజయాన్ని అందుకొని తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకుంది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో పావొలినీ 4 బ్రేక్ పాయింట్లు, 14 విన్నర్లు కొట్టి ఆండ్రీవాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. శనివారం తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడనున్న పావోలినీ ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
బోపన్న జోడీ పరాజయం
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం సెమీస్‌లో ఓటమి చవి చూసింది. గురువారం సెమీఫైనల్లో బోపన్న జంట 5 6 2 బొలెల్లి జంట చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఫుంజుకున్న బోపన్న జోడీ రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో మాత్రం ఈ జంట ప్రత్యర్థి ఆటకు తలవంచింది. ఈ ఓటమితో ఏడేండ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను నెగ్గాలనుకున్న బోపన్నకు నిరాశే మిగిలింది. పురుషుల సింగిల్స్‌లో రష్యా స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6 7 (7/5), 6 అలెక్స్ డీ మినార్ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు. శుక్రవారం జరగనున్న పురుషుల సెమీఫైనల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్‌తో జ్వెరెవ్.. ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్‌తో స్పెయిన్ యువ కెరటం అల్కారాజ్ తలపడనున్నారు.






