స్టోయినిస్ విధ్వంసం
టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ శుభారంభం
మరో మ్యాచ్‌లో ఉగాండా గెలుపు
బ్రిడ్జ్‌టౌన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆసీస్‌కు సునాయస విజయాన్ని అందించింది. గురువారం గ్రూప్ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్థసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో మెహ్రన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కలీముల్లా, బిలాల్ ఖాన్‌లు చెరొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అయాన్ ఖాన్ (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మెహ్రన్ ఖాన్ (16 బంతుల్లో 27) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ మూడు వికెట్లతో చెలరేగగా.. స్టార్క్, నాథన్ ఎల్లిస్, జంపాలు తలా 2 వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.






