8 August, 2026 | 1:17 AM

రేపు గచ్చిబౌలిలో తైక్వాండో గిన్నిస్ రికార్డు ప్రయత్నం

08-08-2026 12:00 AM
  1. వెయ్యికి పైగా క్రీడాకారులతో మహా ప్రదర్శన
  2. గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి

ముషీరాబాద్,ఆగస్టు 7 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9న తైక్వాండోలో గిన్నిస్ వరల్ రికారడ్స్ సాధించే లక్ష్యంతో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మాస్టర్లు శ్రీకాంత్, గజేంద్ర కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ మరియు సుమన్ ఆరట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా తైక్వాండో అభ్యాసకులు పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. 9 నుంచి 70 ఏళ్ల వయస్సు గల తైక్వాండో ఔత్సాహికులు డోబోక్ ధరించి పాల్గొనవచ్చన్నారు. వివరాల కోసం 9246829596, 9391007598 నంబర్లను సంప్రదించాలని సూచించారు.