16 April, 2026 | 7:48 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఉచిత న్యాయసహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

10-11-2025 12:28 AM

బిచ్కుంద, నవంబర్ 9 (విజయ క్రాంతి): విద్యార్థులు చదువులో రాణించి తమ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బిచ్కుంద బార్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్ అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవాదికార సంస్థ దినోత్సవం సందర్భంగా బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచిత న్యాయ సేవల ప్రాముఖ్యతను వివరించారు.

న్యాయపరమైన విషయాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. విద్యభ్యాసంలో ఇంటర్మీడియట్ చదువు కీలకమైందనీ ర్యాగింగ్ కు పాల్పడవద్దని విద్యార్థులు కష్టపడి చదువుకునే తత్వం అలవర్చుకోవాలని ఇంటర్మీడియట్ తరువాత చదువులో విద్యార్థులు ఎంచుకున్న ఉన్నత చదువులు చదువుకొని తమ లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రవి పటేల్ మొహమ్మద్, మనోజ్ రాథోడ్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.