10-11-2025 12:30:22 AM
-తెలంగాణ సహా ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్
-పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): దేశ రక్షణలో ఆర్‌ఎస్‌ఎస్ తన వంతు కృషి చేస్తుందని తెలంగాణ సహా ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఆధ్వర్యంలో ఘనంగా పద సంచాలన్ నిర్వహించారు. కామారెడ్డి వీక్లీ మార్కెట్, గంజ్ రోడ్, జే పిఎన్ రోడ్, సుభాష్ రోడ్, స్టేషన్ రోడ్, కమాన్ రోడ్, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్, సరస్వతి శిశు మందిర్ వరకు పద చాలాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సహా సంఘచాలన్ పాలేటి వెంకట్రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంగ్ చాలన్ బొడ్డు శంకర్, జిల్లా సహా సంఫ్‌ు చాలన్ కొమిరెడ్డి స్వామి, ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.