calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలోనే సొంతింటి కల సాకారం

10-11-2025 12:27:36 AM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా 

ఎల్లారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇండ్లు లేక పూరిగుడిసెల్లో నివాసం గడిపారని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అరులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా అన్నారు. ఆదివారం ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మాణం   చేసుకుంటున్న ఇంటిని నేరుగా మండల కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు కురుమ సాయిబాబా పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నా నిర్వాహకులు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో పాత్రికేయుని కుమారుని కేశఖండనం కార్యక్రమంలో పాల్గొని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సిద్దు, చూడ సంజీవులు, తదితరులు పాల్గొన్నారు.