24 March, 2026 | 1:08 PM

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

24-03-2026 12:00 AM

డా. సాయిసింధు 

శంకర్పల్లి: మార్చి 23: (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డా. సాయిసింధు అన్నారు.సోమవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్ శివారులో గల సాన్స్ స్కిన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్ ఉచిత చర్మ జుట్టు వ్యాధి వైద్య శిబిరాన్ని చందిప్ప గ్రామంలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత డెర్మటాలజీ వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసుత్తం మన తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో స్కిన్ పట్ల నిర్లక్షం వద్దని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎప్పటికి అప్పుడు వైద్యుల సూచనలు తప్పకుండ పా టించి మందులు వాడితే వ్యాధులు నయం అవుతాయని ఆమె చెప్పారు.

ఈ శిబిరంలో 86 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం మరకత శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి డా. సాయి సింధును సవారి సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శేఖర్, మాజీ చైర్మన్ సదానందం గౌడ్, కమిటీ సభ్యులు హన్మంతు, శ్రీనివాస్, ఆలయ అర్చకులు సాయిశివ, ప్రమోద్, వీరేష్ పాల్గొన్నారు.