13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జర్నలిస్టు కేశవచారి అకాల మరణం తీరని లోటు

24-03-2026 12:00 AM

 మృతుని కుటుంబ సభ్యులకు రూ 15 వేల ఆర్థిక సాయం అందించిన ప్రెస్ క్లబ్ సభ్యులు 

మహబూబ్ నగర్, మార్చి 23 (విజయ క్రాంతి) : ప్రజా సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం శ్రమించి అ కాల మరణం చెందిన జర్నలిస్టు కేశవచారి మరణం తీరని లోటని ప్రెస్ క్లబ్ సభ్యులు మృతిని కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ నుంచి రూ 15 వేల ఆర్థిక సహాయం చేశారు.

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న కేశవాచారి ఆదివారం అనారోగ్యంతో రాత్రి మరణించడంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామానికి కేశవ చారి మృత దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తీసుకువెళ్లడంతో అక్కడికి చేరుకొని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఆర్థిక సాయం అం దించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు నరేందర్ గౌడ్, పల్లెమోని యాదయ్య, వెంకటేష్, రవి, మోహన్ దాస్, సాయికుమార్, రామ్ కొండ, తదితరులు ఉన్నారు.