calender_icon.png 20 January, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026 12:04:53 AM

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

ఎర్రుపాలెం జనవరి 19 ( విజయ క్రాంతి): యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ పౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, నిర్వాహకులు సినీ నటుడు కృష్ణంరాజు కుమార్తె ప్రసీద తెలిపారు. ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ యువనేత మల్లు సూర్య విక్రమాదిత్య తో కలిపి వారు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే ప్రముఖ షుగర్ సర్జన్ డాక్టర్ ఖ్యాతిగాంచిన డాక్టర్ వేణు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి అపోలో ఆస్పత్రికి చెందిన 10 మంది డాక్టర్లు, ఖమ్మం నుండి మరో 20 మంది డాక్టర్లు హాజరు కానున్నారని వారు తెలిపారు. షుగర్ వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన  ఉచితంగా ఆపరేషన్ చేయటం జరుగుతుందని వారు తెలిపారు.