calender_icon.png 7 October, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తలసాని జన్మదిన వేడుకలు

07-10-2025 01:27:25 AM

సనత్‌నగర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి):- మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మి త్రుల మధ్య ఘనంగా జరిగాయి. సోమవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శిం చుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహిం చిన అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

ఆలయ ఆవరణలో పార్టీ నాయకులు, ఆలయ మాజీ సభ్యుల ఆధ్వర్యం లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తులభారం నిర్వహించారు. అలాగే అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో ఆసియన్ సత్యం దగ్గర హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించగా తలసాని సాయికిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. సనత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి తలసాని జన్మదిన సందర్భంగా హనుమాన్ దేవస్థానంలో ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పద్మారావు నగర్ బిఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన తలసాని శ్రీనివాస్ జీవిత నేపధ్యం, రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయాలను వివరించే డాక్యుమెం టరీని ప్రదర్శించారు. అదేవిధంగా బేగంపేట డివిజన్‌కు చెందిన నాగరాజు గౌడ్ ఆధ్వ ర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజే శారు. కార్వాన్ కు చెందిన నాయకుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పూలమాలను క్రేన్ సాయంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అలంకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, బిఎస్ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, పీయూష్ గుప్తా, మల్లేష్ యాదవ్, పురుషోత్తం, రవికుమార్, ఆర్బి మహేష్, పలారం బండి మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.