calender_icon.png 14 December, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్సీతో మ్యాచ్ మధుర జ్ఞాపకం

14-12-2025 12:53:50 PM

హైదరాబాద్: శనివారం ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో క్రీడాభిమానులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా మెస్సీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆహ్వానాన్ని అంగీకరించి హైదరాబాద్‌ను సందర్శించినందుకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi), ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగోడి పాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది క్రీడా ప్రియులను, ముఖ్యంగా యువతను ఆనందపరిచింది. నిన్నటి సాయంత్రం మాతో చేరి జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని మేము ప్రపంచానికి చూపించాము. నగరం అంతటా విధుల్లో ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, అన్ని విభాగాల సిబ్బందికి మా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మా ప్రభుత్వం తరపున, మా అతిథులు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి నిన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఓట్ చోరీ వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో జరిగే భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.