calender_icon.png 14 December, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు మన బాధ్యత

14-12-2025 01:28:58 PM

మానకొండూర్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులుగా మన బాధ్యతని తెలంగాణ ప్రింట్ మీడియా సర్క్యులేషన్ అసోసియేషన్(Telangana Print Media Circulation Association) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మంచాల రాజు పేర్కొన్నారు. ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మన ఓటు, మన ధైర్యం, మన భవిత అని ఓటర్లకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలన్నారు18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును పొంది బాధ్యతగా ఓటు హక్కును నియమించుకోవాలన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా అమూల్యమైన విలువైన ఓటు హక్కును సద్వినించుకొని ప్రజాస్వామ్య దేశంలో పటిష్టమైన నాయకులను ఎన్నుకున్న వారవుతారని ఆయన సందేశం ఇచ్చారు