calender_icon.png 7 October, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐపై దాడి దేశ చరిత్రలో చీకటి రోజు

07-10-2025 01:27:59 AM

ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి):  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్  గవాయ్‌పై  దాడియత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత అధికారిపై దాడి చేసి బెదిరించడానికి జరిగిన దుర్మార్గపు ప్రయత్నాన్ని తాను మాటల్లో ఖండించలేనని చెప్పారు.

ఇది మన దేశ చరిత్రలో చీకటి రోజు అని సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇటువంటి పిరికి దాడులకు తాను భయపడబోనని ధైర్యంగా ప్రకటించిన ధైర్యవంతుడైన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి దేశ పౌరులతో కలిసి తాను సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 

భారత న్యాయ వ్యవస్థపై దాడినే: భట్టి విక్రమార్క 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై ఒక న్యాయవాది దాడి భారత న్యాయవ్యవస్థ, స్వతంత్ర, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ఒక హేయమైన చర్య అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ గౌరవం, ప్రజాస్వామ్య లౌకికవాదం ఆశయాలపైన దాడిగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

దాడికి పాల్పడిన న్యాయవాదిపై చర్య లు తీసుకోవాలన్నారు. ఆ న్యాయవాది ఆలోచనలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేసిందని తెలిపారు. జస్టిస్ గవాయ్ రాజ్యాంగ పరిరక్షకుడని, అత్యుత్తమ విలువలు కలిగిన వ్యక్తి అని, వారికి దేశం యావత్తు సంఘీభా వం తెలిపి, ఐక్యంగా నిలబడాల్సిన సందర్భమని తెలిపారు.