calender_icon.png 14 December, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

14-12-2025 01:33:49 PM

జిల్లా ఎస్పీ. మహేష్ దిగితే.

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు( Gram Panchayat elections) ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగాలపల్లి మండలాలలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెట్రోలింగ్ వాహనాలు,ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.