calender_icon.png 7 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని వదిలిపెట్టం

07-10-2025 01:26:03 AM

బీసీలు బలమైన ఉద్యమం చేపట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాం తి): రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వెళ్లిన వారినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, వారి భరతం పడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి బీసీలు బలమైన ఉద్యమం చేపట్టాల ని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను గత 76 ఏళ్లుగా బీసీలను అగ్రవర్ణాలు అణచివేశారని,   రిజర్వేషన్లను కాపాడుకోవడానికి బీసీ లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి వేసిన కేసును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఇంప్లీట్ కేసు వేయడం జరిగిందన్నారు. గోపాల్‌రెడ్డి వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షనీయమన్నారు. అనవసరం గా రిజర్వేషన్లు వ్యతిరేకించి గ్రామాలలో శాంతియుత వాతావరణం చెడగొట్టొద్దని అన్నారు స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధ,  చట్ట బద్ధత, న్యాయబద్ధత ఉందన్నారు.  అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు.  కోలా జనార్దన్‌గౌడ్, పగిళ్ల సతీష్ కుమార్, రామ్ కోటి, అంజి, వరప్రసాద్ యాదవ్, చిక్కుడు బాలయ్య, రాకేష్, అభిగౌడ్, ఆశిష్‌గౌడ్ పాల్గొన్నారు.