calender_icon.png 14 December, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్దలకు అంబాసిడర్ కేటీఆర్

14-12-2025 12:14:00 PM

92శాతం  కాంగ్రెస్ సర్పంచ్ లు విజయం 

ఏకగ్రీవం పంచాయతీ 'లకు రూ. 20 లక్షలు 

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

కరింనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో(Manakondur Constituency) రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, 92 శాతం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ సర్పంచులు(Congress Sarpanchs) విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana) అన్నారు. విజయక్రాంతి ప్రతినిధితో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... మానకొండూర్ నియోజకవర్గం లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 11 చోట్ల కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినాయన్నారు. 

తాను ముందుగా ప్రకటించినట్లు ఏక గ్రీవమైన కాంగ్రెస్ పంచాయతీలకు(Congress Panchayats) ఒక్కో పంచాయతీ కి రూ. 20 లక్షలు  ఆయా పంచాయతీ ల అభివృద్ధి కోసం అందజేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లోనూ 90 శాతం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశిస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కు చాలా వరకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి. బీఆర్ఎస్ 92 శాతం గెలిసిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.

ఇందులో నిజమేంత అనే ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానమిస్తూ కేటీఆర్ అబద్దాలు(KTR's lies) ఆడడంలో అంబాసీడర్ అని ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు. సత్యాన్ని అసత్యం చేయడం నమ్మించే ప్రయత్నం చేయడం కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అభివర్ణించ్చారు. గ్రామాలలో చూస్తే తెలుస్తుంది. కొన్ని చోట్ల మా పార్టీ వారే రెబల్ గా ఇద్దరూ, ముగ్గురూ ఉన్న చోట కేవలం 10 లేక 20 ఓట్ల తేడా తో ఓడిపోయారు.  ఆది మేం ఓటమి అనుకోవడం లేదు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తాను పుట్టి పెరిగిన మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామంలో ఈ రోజు ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించు కున్నానని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు.