calender_icon.png 14 December, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్

14-12-2025 01:15:56 PM

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Telangana Panchayat Elections) రెండో దశ పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 3,911 సర్పంచ్ స్థానాలు, 29,917 వార్డు స్థానాలకు ఆదివారం పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామపంచాయతీల్లో ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు. దీంతో 3,911 సర్పంచ్, 71,071 మంది వార్డు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి అధికారలు ఫలితాలు వెల్లడిస్తారు.

రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకుగానూ 415, 38,322 వార్డుల్లో 8,304 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.71 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికారులు జిల్లా వారీగా పోలింగ్ శాతాలను కూడా విడుదల చేశారు. నివేదిక అందిన సమయం వరకు రంగారెడ్డి జిల్లాలో 54.33 శాతం, వరంగల్‌లో 59.31 శాతం, హనుమకొండలో 54.11 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 57.57 శాతం, యాదాద్రి భువనగిరిలో 56.51 శాతం పోలింగ్ నమోదు కాగా, సూర్యాపేటలో అత్యధికంగా 60.07 శాతం పోలింగ్ నమోదైంది.