calender_icon.png 14 December, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు వేసావా అవ్వా

14-12-2025 01:31:14 PM

వృద్ధ ఓటరుతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్

పోలింగ్ కేంద్రం వద్ద మానవీయ దృశ్యం

పెద్దపల్లి,ధర్మారం,(విజయక్రాంతి): ఓటు వేసావా అవ్వా... అంటూ వృద్ధ ఓటరుతో ఆప్యాయంగా పలకరించి పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్(Peddapalli ACP Krishna Yadav) అడిగి తెలుసుకున్నారు. ధర్మారం మండలంలోని(Dharmaram Mandal) ఖిలా వనపర్తి పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలితో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వృద్దురాలుని ఆప్యాయంగా పలకరించి ఓటు వేసావా అమ్మా అంటూ, పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి పోలీస్ వారు సహాయం చేశారా, ఆరోగ్య పరిస్థితి బాగుందా అని మానవత్వంతో అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు సహాయంగా ఉంటారని, ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసీపీ కృష్ణ యాదవ్ సూచించారు.