calender_icon.png 19 February, 2026 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్జి మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

19-02-2026 02:53:06 AM

మాడుగులపల్లి మండలం చిరుమర్తి స్కూల్‌లో అందజేత

దివ్యాంగురాలైన ఆశ్ర వైద్య ఖర్చులకు రూ 10 వేలు.. మరొకరికి ట్రై సైకిల్ 

మిర్యాలగూడ, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): మాడుగులపల్లి మండలంలోని యూపీఎస్ చిరుమర్తి స్కూల్‌లో బుధవారం గజ్జి నాగభూషణం జ్ఞాపకార్థం గజ్జి నాగభూషణం ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరా లుగా ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2024-.25, 2025.26 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, అదేవిధంగా4,5,6 వ తరగతులకు చెందిన విద్యార్థులకు సైతం మొదటి ప్రతిభా పురస్కారంగా రూ.1,400లు, ద్వితీయ ప్రతిభా పురస్కారంగా రూ.1,200 చొప్పున మొత్తం 15, 600 రూపాయలు అందజేశారు.

ఇద్దరు దివ్యాంగుల విద్యార్థులకు 1000 చొప్పున 2000 రూపాయలుఅందించారు. అదేవిధంగా దివ్యాంగురాలైన ఆశ్ర వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలు, మరో దివ్యాంగుడైన సంపత్ కు ట్రై సైకిల్ ఇవ్వనున్నట్లు శివాలయ ఆలయ కమిటీ అధ్యక్షుడు సోమేశ్వర ధార్మిక పరిషత్ అధ్యక్షులు గజ్జి మధుసూదన్ అమృతవల్లి దంపతులు ముందుకు వచ్చారు. గజ్జి నాగభూషణం కూతురైన కామిశెట్టి సరళ విద్యార్థులకు యోగా చేయడానికి కావలసిన మ్యాట్లు అందజేస్తానని ముందుకు వచ్చారు.  కార్యక్రమంలో గజ్జి నాగభూషణం సతీమణి అనసూయ, కామిశెట్టి సరళ సర్పంచ్ కూరెల్ల నాగమణి వెంకటాచారి, ప్రధానోపాధ్యాయులు మారోజు విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.