calender_icon.png 17 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలెంట్ హంట్!

17-10-2025 01:29:53 AM

కొత్త ప్రయోగం

ఉద్యోగులే రిక్రూటర్లు 

రిఫర్, ఇంటర్వ్యూ చేసిన వారికి రూ.50 వేల దాకా ప్రోత్సాహకాలు 

సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములుగా మార్చడమే లక్ష్యం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : కరోనా విలయం తర్వాత సంభవించిన సంక్షోభం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ రంగం కుదేలైంది. ఈ పరిణామంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీలు సైతం సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కొవడంలో ఇబ్బందిపడుతున్నాయి. దీంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఆయా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పటికే వేలాది మందిని విధుల నుంచి కూడా తొలగించాయి.

ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఉంది. అయితే లే ఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్, వినూత్న ప్రయోగానికి శ్రీకా రం చుట్టింది. మళ్లీ కొత్త ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేవిధంగా అడుగులు వేస్తోంది. అయితే తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులనే కొత్త వారిని రిక్రూట్ చేసే బాధ్యతను అప్పగించింది. కొత్త ఉద్యోగ నియామకాల కోసం తమ సిబ్బ ందినే రిక్రూటర్లుగా మార్చింది.

కంపెనీ ప్రస్తుతం ఉద్యోగుల ద్వారా కొత్త టాలెంట్‌ను వెతుకుతూ, నగదు బహుమతులు ప్రకటించింది. ఇన్ఫోసిస్ అవలంబిస్తున్న ఈ పద్ధ్దతితో అటు కంపెనీలో పని చేస్తూ కొత్త వారిని రిఫర్‌చేసిన వారికి నగదు బహుమతులు, ఇటు నైపుణ్యం ఉండి ఉద్యోగం కావా లనుకునే వారికి అవకాశం లభించినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 

స్థాయిల వారీగా..

ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కొత్త అభ్యర్థులను రిఫర్ చేస్తే లేదా ఇంటర్వ్యూ నిర్వహించడంలో భాగం అయి తే వారికి డబ్బు ఇస్తారు. అయితే ఈ నగదు బహుమతి ప్రక్రియ వివిధ స్థాయిల వారీగా ఉంటుంది. రిఫర్, ఇంటర్వ్యూకు హాజరైనవారు.. దాటిన లెవల్స్‌కు అనుగుణంగా బ హుమతులను ప్రకటించింది. రిఫర్ చేసిన అభ్యర్థి లెవల్ 3 దాటితే రూ.10 వేలు, లెవ ల్ 4 దాటితే రూ.25 వేలు, లెవల్ 5 దాటితే రూ.35 వేలు, లెవల్ 6 దాటితే రూ.50 వే లను కంపెనీలోని ఉద్యోగి పొందుతారు.

దీంతోపాటు సీనియర్ లెవల్ ఉద్యోగులు లెవల్ 5, లెవల్ 6 స్థాయిలో ఒక్కో ఇంట ర్వ్యూ నిర్వహిస్తే రూ.700 బహుమతి పొం దుతారు. అలాగే ఉద్యోగ విరామం తర్వాత తిరిగి పనిచేయాలనుకునే మహిళల కోసం ‘రీ స్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరుతో ప్ర త్యేక ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీనిలో మహిళా అభ్యర్థులను రిఫర్ చేసే ఉద్యోగులకు రూ. 10,000 నుంచి రూ.50,000 వరకు బహుమతులు ఇస్తోంది. కానీ ఈ పథకం కేవలం భారతదేశంలోని నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్‌ఆర్ విభాగం లే దా టాలెంట్ అక్విజిషన్ టీమ్ సభ్యులు ఈ బహుమతులకు అర్హులుకారని స్పష్టంచేసింది. 

ఈ పద్ధతి ఎందుకు..

ప్రస్తుతం అనుభవజ్ఞులైన టెక్ టాలెంట్ దొరకడం కష్టమవుతోంది. దీంతో ఉద్యోగు ల ద్వారా రిఫరల్‌లు, ఇంటర్వ్యూలు వేగంగా జరగడం కోసం ఈ పద్ధతి కంపెనీ అవలంబిస్తుంది. లేటరల్ హైరింగ్ వేగవంతం చేయడం, రిక్రూట్‌మెంట్ ఖర్చులు త గ్గించడం, అలాగే ఉద్యోగులను సంస్థాభి వృద్ధిలో భాగస్వామ్యులుగా మార్చడం ఈ పథ కం వెనుక ఉద్దేశంగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతోపాటు ఉద్యో గుల్లో కూడా ప్రోత్సాహం నింపినట్టు ఉంటు ంది.

సీనియర్ స్టాఫ్ ఇంటర్వ్యూలలో సమ యం కేటాయిస్తారు. వారికి డబ్బుతో గుర్తిం పు ఇవ్వడం ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కూడా ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుం ది. అయితే ఈ ప్రక్రియలో కాస్త ఖర్చు పెరిగిన కంపెనీకి ప్రయోజనమే చేకూరుతుంది. ఒక్కో ఇంటర్వ్యూకు రూ. 700 ఇవ్వడం ఖర్చుతో కూడుకున్నా, మంచి అభ్యర్థులను త్వరగా తీసుకోవడంలో సహాయం చేస్తుంది.

కానీ దీనిపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇంటర్వ్యూలు అంటే తప్పనిసరిగా నాణ్యత లోపించే అవకాశం ఉంటుంది. ఇన్ఫోసిస్ నియామక ప్రక్రియ కోసం ఎంచుకున్న ఈ పద్ధతి ఉద్యోగుల మానసిక ఉత్సాహాన్ని పెం చి, కంపెనీ నియామక ప్రక్రియను వేగవం తం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల ద్వారా వచ్చిన రిఫరల్‌లు సాధారణంగా నాణ్యమైన అభ్యర్థులను తీసుకు వస్తాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో చురుకుదనం పెరగడానికి మంచి ప్రయ త్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

20 వేల మంది ఉద్యోగులు అవసరం..

ఇన్ఫోసిస్ కంపెనీ ఇటీవల కాలంలో భారీగా లేఆఫ్స్ ప్రకటించినప్పటికీ 2025 26 ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్లను తీసుకోవాలని గతంలోనే ప్రకటించింది. దీంతోపాటు ప్రాజెక్టు విస్తరణలు, కొత్త క్లయింట్లు, ఏఐ డిమాండ్ పెరుగుదల కారణంగా లేటరల్ నియామకాల అవసరం కూడా ఉంది. అయితే ఇన్ఫోసిస్ కంపెనీ ఈ ఏడాది మొత్తం 30 వేల నియామకాలు చేపట్టవచ్చని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే సుమారు 10 వేల నుం చి 12 వేల వరకు లేటరల్ నియామకాలు వచ్చే ఏడాది నాటికి చేయాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కనీసం 30 నుంచి 40 శాతం నియామకాలు ఈ కొత్త టాలెంట్ హంట్ స్కీమ్ ద్వారానే జరగవచ్చని అం చనా వేస్తున్నారు.

ఈ స్కీమ్ ద్వారా దాదాపు 3 నుంచి 5 వేల మంది వరకు నియామకాలు జరిగే అవకాశం ఉంది. అయితే టా లెంట్ హంట్ స్కీమ్ ఇటీవలే ప్రారంభించిన నేపథ్యంలో ఫలితాలను బట్టి తర్వాత విస్తరించనున్నట్టు తెలుస్తోంది. రిఫరల్ ద్వారా వచ్చే అభ్యర్థులు సాధారణంగా ప్రత్యేక నైపుణ్యాలున్న వారు కావడంతో ఎంపిక శాతం తక్కువగానే ఉండే అవకాశం ఉంది.