జాతీయ పోటిల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మంచిర్యాల టౌన్, జూలై 1 : మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగిన పెన్కాక్ సిలాట్ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించా రు. కే మోక్షిత్ గోల్ మెడల్ సాధించగా ఈ. దక్ష, వీ. అక్షర వేదశ్రీ, ఏ. మహాలక్ష్మి శర్మ, టీ. ఆరుష్, జీ. విగ్నేష్ లు సిల్వర్ మెడల్స్ పొందారు. పి. రితేష్, జీ. అచ్యుత్ శ్రీ దేవాన్ష్, టీ. నయనశ్రీ, టీ. నిహానిష్, టీ శివాజీలు బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను బుధ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పె న్కాక్ సిలాట్ జిల్లా సెక్రటరీ దాసరి రాజేశ్వర్, మాస్టర్ పోచంపల్లి వెంకటేశ్, స్టేట్ టెక్నికల్ చైర్మన్ రంగు శ్రీనివాస్, కోశాధికారి మోయిన్, జెట్టి కృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






