18 July, 2026 | 4:15 AM

భావోద్వేగాలే ప్రధానంగా పా.. పా

02-12-2024 01:42 AM

తెలుగు తెరపైకి ఓ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళంలో ‘డా..డా’ పేరుతో విడుదలైన ఆ సినిమాను తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జేకే ఎంటర్‌టైన్‌ంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల కానుంది. గత ఏడాది తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాలో కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రధారులుగా, డైరెక్టర్ గణేశ్ కే బాబు తెరకెక్కించారు.

కోలీవుడ్‌లో అతితక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.30 కోట్ల వసూళ్లు సాధించి విజయాన్ని అందుకుంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందించిన ఈ సినిమాలో కామెడీ, భావోద్వేగం, ప్రేమ.. అన్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. భాగ్యరాజా, వీటీవీ గణేశ్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జెన్ మార్టిన్; సాహిత్యం: రవివర్మ ఆకుల.