28 July, 2026 | 2:45 AM

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

25-06-2024 06:01 PM

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశంలో మంగళవారం 40 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ వారందరితో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  ఎంపీలే కాకుండా తమిళనాడు కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ కే. గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

సభకు నమాస్కారం. భారత పార్లమెంట్ లోక్ సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతాను అంటూ రాజ్యంగం ప్రతిని చేతిలో పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చివర్లో తమిళంలో థ్యాంక్యూ..  జై తమిళనాడు.. అని మాట్లాడారు.

కృష్ణగిరి కుప్పం ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అక్కడ ఆయన తెలగులో మాట్లాడుతారు. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో తెమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలపొందిన ఆయన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.