4 March, 2026 | 3:39 AM

తమ్మిడికుంటకు పర్యాటక శోభ

11-11-2025 01:29 AM

-ముమ్మరంగా పునరుద్ధరణ పనులు  

-ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్న హైడ్రా 

-పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్  సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఐటీ కారిడార్ నడిబొడ్డున ఉన్న మాధాపూర్‌లో మరో ప్రకృతి రమణీయ ప్రాంతం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు మురుగునీ టితో, దుర్గంధంతో నిండిన తమ్మిడికుంట, ఇప్పుడు హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ చర్యలతో తన సహజ స్వరూపాన్ని సంతరించు కుంటోంది. ముళ్లపొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మీటర్ల కొద్దీ పేరుకుపోయిన పూడికను తొలగించి, చెరువుకు కొత్త జీవకళను అంది స్తున్నారు. ఈ అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.చెరువులో ఆక్రమణలు, పూడికను తొలగించి విస్తీర్ణం పెంచడం తో, ప్రస్తుతం ఆ పరిసరాలు ఎంతో విశాలం గా మారాయి. 

14 ఎకరాలుగా ఉన్న చెరువును 29 ఎకరాలకు విస్తరించినట్లు కమిషనర్ తెలిపారు. చెరువు చుట్టూ పటిష్టమైన బండ్ నిర్మాణం, ఇన్, ఔట్‌లెట్ల నిర్మాణ పనుల తీరును ఆయన తనిఖీ చేశారు. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ చెరువును ఒక సుందరమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం వద్ద వర్షం నీరు నిల వకుండా ఇన్‌లెట్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని సూచించారు.దేశ నలుమూలల నుంచి వచ్చిన ఐటీ నిపుణులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంపై దృష్టి పెట్టాలని కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్, హైడ్రా ఏసీపీ శ్రీకాంత్, ఇతర అధికారులు ఉన్నారు.