గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్‌గా తాన్య
04-06-2026 12:22 AM
జిన్నారం/ అమీన్ పూర్, జూన్ 3 : గడ్డపోతారం పురపాలక సంఘ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్గా పి.తాన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






